సిగాచి పరిశ్రమ ఘటన..బాక్సుల్లో మృతదేహాల మాంసపు ముద్దలు

-

దయనీయంగా సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటన మారింది. మృతదేహాల మాంసపు ముద్దలను బాక్సుల్లో ప్యాక్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న దృశ్యం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అటు నేడు సిగాచి పరిశ్రమకు CS నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైలెవెల్ కమిటీ సభ్యులు ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు.

sigachi
A scene of bodies being packed in boxes and handed over to family members

కమిటీకి ఛైర్మన్‌గా CS రామకృష్ణారావు, సభ్యులుగా రెవెన్యూ, ఇండస్ట్రీ చీఫ్ సెక్రటరీలతో పాటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైర్ డీజీ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఉన్నారు. నిన్న ప్రమాద స్థలిని పరిశీలించింది నిపుణుల కమిటీ. నేడు సిగాచి పరిశ్రమకు CS నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news