బనకచర్ల ప్రాజెక్ట్ నేపథ్యంలో.. చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. తాజాగా ఏపీ ప్రభుత్వానికి CWC లేఖ రాసింది. బనకచర్ల ప్రాజెక్ట్ వివరాలు అడిగింది కేంద్ర జలసంఘం. గోదావరి వరద జలాలకు సంబంధించి డేటా కోరింది CWC. ఏపీలో ప్రతిపాదిక ప్రాజెక్టుల వివరాలపై నివేదిక కోరిన కేంద్ర జలసంఘం.

ఇక ఇప్పటికే బనకచర్ల ప్రాజెక్టుకు… కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది కేంద్ర సర్కార్. బనకచర్లకు పర్యావరణ అనుమతులు తిరస్కరించింది మోడీ ప్రభుత్వం. బనకచర్లపై ఏపీ ప్రతిపాదన ను తిప్పి కొట్టింది. అనుమతులు ఇవ్వలేమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి స్పష్టం చేసింది.