పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ..హైకోర్టు సంచలన తీర్పు !

-

పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది..హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంజ్ ఆదేశించింది. స్పీకర్ కు ఏలాంటి టైం బాండ్ లేదని పేర్కొంది హైకోర్టు.

brs

రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు… స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలన్న సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసింది హైకోర్టు. దీంతో ఇప్పుడు తెలంగాణ స్పీకర్‌ నిర్ణయంపై పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఉంటుంది. ఈ లెక్కన పార్టీ మారిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు కానుందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి.. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లిన వారిలో కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version