బీజేపీకి షాక్.. కాంగ్రెస్ గూటికి మాజీ ముఖ్యమంత్రి..!

-

లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిలో ఒక నేత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం, కేంద్ర మంత్రి డీవీ సదానంద్ గౌడ్ పార్టీకి రాజీనామా చేయనున్నారు.

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 224 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన కమలం కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే, త్వరలో జరగబోయే 28 లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ కి చెక్ పెట్టాలని భావిస్తున్న కషాయ దళానికి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, కేజే జార్జ్ సమక్షంలో బైందూరు మాజీ ఎమ్మెల్యే సుకుమార్ శెట్టి, ముదిగెరె మాజీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామితో పాటు. కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక బ్యాక్ వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన కోర్గి జయప్రకాష్ హెగ్దే కాంగ్రెస్ లో చేరారు.

Read more RELATED
Recommended to you

Latest news