కాలేజీ టాయ్ లెట్లో ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చిన ఘటన తమిళనాడులోని తంజావురు జిల్లాలోని కుంభకోణంలో వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కుంభకోణంలోని ఓ ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థిని గర్భం దాల్చింది.
శుక్రవారం తరగతి గదిలో ఉండగా ప్రసవ నొప్పులు రావడంతో మరుగుదొడ్డికి వెళ్లి ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం యూట్యూబ్ వీడియో చూసి తనంతట తానే బొడ్డు కోసి.. అనంతరం బిడ్డను కళాశాలలోని చెత్తకుండీలో పడేసి చెత్తతో కప్పేసింది. తర్వాత ఏం జరగనట్లు వెళ్లి తరగతి గదిలో విద్యార్థిని కూర్చుంది. రక్తస్రావాన్ని గుర్తించిన అధ్యాపకులు తల్లిని, బిడ్డను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించగా ఇరువురు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.