లోక్సభలో వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ 2024పై లోక్సభలో చర్చ నడుస్తోంది. అధికార పార్టీపై ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.చైనాతో సరిహద్దు పరిస్థితి.. భారీ వాణిజ్య లోటుపై చర్చించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభలో ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ మంత్రిపై ఫైర్ అయ్యారు.
పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఓ మంత్రి జేబులో చేతులు పెట్టుకుని పార్లమెంటుకు వచ్చారు. ఈ విషయంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, మీ చేతులు మీ జేబులో పెట్టుకోవద్దు అని అన్నారు.ముందుగా, గౌరవనీయులైన సభ్యులారా.. మీ జేబులో చేతులు పెట్టుకుని సభకు రావద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.” అని ఓం బిర్లా అన్నారు.