అమెరికాలో హిందూ దేవుళ్ళకి  ఘోర అవమానం…!!!!

-

అమెరికాలో జాత్యహంకారం రోజు రోజుకి పెరిగిపోతోంది. ఇప్పటికే భారతీయులపై ఎన్నో రకాల దాడులు చేస్తున్న అమెరికన్స్ తాజాగా ఈ సారి హిందువులు పరమ పవిత్రంగా కోలుచే దేవుళ్ళ ని టార్గెట్ చేసుకున్నారు. అమెరికాలోని ఈ కామర్స్ కంపెనీలు హిందూ దేవుళ్ళని, హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

అమెరికాలో ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అయిన కాలిఫోర్నియా లోని బోసి స్పోర్ట్స్ కంపెనీ తాము తయారు చేసే లోదుస్తుల పై హిందూ దేవతలా బొమ్మలు వేసి ఆన్లైన్ లో పెట్టింది. హిందువులు ప్రతీ పూజలో ముందుగా కొలిచే వినాయకుడి బొమ్మని లో దుస్తులపై ముద్రించి 35 డాలర్లకి అమ్మకానికి పెట్టింది. ఈ విషయం ఆనోటా ఈనోటా తెలియడంతో యూనివర్సల్ సొసైటీ ఆఫ్ హిందూయిజం అధ్యక్షుడు జెద్ తీవ్రంగా స్పందిచారు.

సదరు కంపెనీ వెంటనే ఆ వస్తువులని ఆన్లైన్ నుంచీ తీసేయాలని, ఇకపై హిందువుల మనోభావాలని కించపరచకుండా ఉండేలా హిందువులు అందరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వేళ సదరు కంపీనీ స్పందించక పొతే అమెరికాలో ఉన్న 30 లక్షల మంది హిందువులు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు. ఇదిలాఉంటే అమెరికాలో గతంలో కూడా హిందువుల బొమ్మలని డోర్ మ్యాట్, యోగ మ్యాట్ లపై కొన్ని కంపెనీలు ముద్రించాయి అయితే భారతీయ ఎన్నారైలు స్పందిచి నిరసన చెప్పడంతో ఆ కంపెనీ క్షమాపణలు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news