బిజెపికి గట్టి ఎదురుదెబ్బ..!

-

మహారాష్ట్రలో మొదటినుంచి బీజేపీకి శివసేన కూటమి వరుసగా షాకుల ఇస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే డిసెంబర్ 1న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో కూడా మరోసారి మహారాష్ట్రలో బీజేపీ కి ఎదురు దెబ్బ తగిలింది. డిసెంబర్ ఒకటవ తేదీన మూడు గ్రాడ్యువేట్ 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఈ క్రమంలోనే ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఎంతో మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు.

bjp

అయితే ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను సాధించేందుకు అటు బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ కి భారీ షాక్ తగిలింది. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడ్డాయి. అయితే 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను కేవలం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని మాత్రమే బిజెపి దక్కించుకోవడం గమనార్హం. ఇక మిగతా నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస అఘాడి కూటమి విజయం సాధించింది. దీనిపై మాట్లాడిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్… శివసేన కూటమి బలాన్ని తక్కువ అంచనా వేసినాము అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news