హైదరాబాద్‌ లో దారుణం ; యువతికి లిఫ్ట్‌ ఇచ్చి గ్యాంగ్‌ రేప్‌ !

మన దేశంలో మహిళలపై అత్యాచారాలు ఏ మాత్రం తగ్గటం లేదు. రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప… ఎక్కడ… గ్యాంగ్ రేప్ ల సంఖ్య తగ్గటం లేదు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు అమలు చేసినప్పటికీ కొందరు మానవ మృగాలు లో మార్పు రావడం లేదు. తాజాగా… హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతికి లిఫ్ట్ చేసి మరీ.. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు దుర్మార్గులు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో.. 25 సంవత్సరాల ఓ యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. పీకలదాకా తాగిన ఆ ముగ్గురు యువకులు… బాధిత యువతికి తమ ఆటో లో నిన్న రాత్రి లిఫ్ట్ ఇచ్చారు. అదే అదునుగా చేసుకొని…. అమ్మాయికి బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ కు ఆల్ పడ్డారు ఆ ముగ్గురు యువకులు. హిమాయత్ సాగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ సమీపంలో ఆ యువతిపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. బాధిత యువతి కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.