లిఫ్ట్ రాకముందే తెరుచుకున్న తలుపు.. ఇంత‌లోనే యువ‌కుడు..

-

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గవర్నర్‌పేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు బందరు రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఈ ఉదయం కిందికి దిగేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చి బటన్ నొక్కాడు. ఆ వెంటనే తలుపు తెరుచుకుంది. అయితే, అప్పటికి లిఫ్ట్ రాకపోవడంతో.. చూడ‌కుండా లోపలికి అడగుపెట్టిన వెంటనే అమాంతం కిందపడిపోయాడు.

ఐదో అంతస్తు నుంచి పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news