హనుమకొండ జిల్లాలో యువతి దారుణ హత్య..రేప్‌ చేసి మరీ !

-

హనుమకొండ జిల్లాలో యువతి దారుణ హత్య జరిగింది. రేప్‌ చేసి మరీ ఆమెను హత్య చేసినట్లు సమమాచారం. కాజీపేట మండలంలోని ఓ వెంచర్లో వివాహిత దారుణ హత్యకు గురైంది. ముఖంపై బండ రాయితో విచక్షణా రహితంగా మొది చంపేశారు దుండగులు.. బుధవారం సాయంత్రం భట్టుపల్లి, అమ్మవారిపేట మధ్య వెంచర్లో బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి చెట్ల పొదల్లో రక్తపు మడుగులో యువతి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

a crime in hanumakonda

సెంట్రల్ డీసీపీ ఎంఏ బారి, కాజీపేట ఏసీపీ తిరుమల్, ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఎస్సైలు రాజబాబు, దివ్య సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంకా రక్తం తడి ఆరకపోవడం మధ్యాహ్నం తర వాతే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హత్య జరిగిన స్థలంలో బ్యాగు, మహిళ పర్సు, మృతురాలి చెప్పులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. .. క్లూస్ టీమ్ .. డాగ్ స్క్వాడ్ తో.. సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు పోలీసులు. మృతురాలు పర్సులో లభించిన ఆధార్ కార్డు బట్టి ఆమెను దర్గాకాజీపేటలోని లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా కుమార్ భార్య లావుడ్యా యామిని అలియాస్ కుమారి (33)గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version