మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ వలన చాలా ఉపయోగాలు వున్నాయి. ఆధార్ లేకపోతే నిజంగా కొన్ని పనులు అవ్వవే అవ్వవు. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ ఏ గుర్తింపు కార్డు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మొదలు ఎన్నో వాటికి ఈ ఆధార్ అవసరం అవుతుంది. అయితే కొందరు ఆధార్ కార్డు ని దుర్వినియోగం చేస్తున్నారు.
ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆధార్ జారీ చేసే సంస్థ యూఐడీఏఐ మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేసారని సందేహం ఉంటే ఇలా కనిపెట్టచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆరు నెలల క్రితం నుంచి ఆధార్ హిస్టరీ ని తెలుసుకోవచ్చు. గరిష్టంగా 50 రికార్డులను ఒకేసారి వీక్షించవచ్చు.
ఇక ఎలా హిస్టరీ ని చూడచ్చో చూసేద్దాం:
ఇందుకోసం మొదట మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
ప్రాధాన్యత భాష కింద తెలుగు లేదా ఇంగ్లిష్ ని ఎంపిక చేసుకోండి.
ఇప్పుడు మీరు నా ఆధార్ విభాగానికి వెళ్లాలి.
ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ కనపడుతుంది దాన్ని మీరు సెలెక్ట్ చేసేయండి.
ఆధార్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
వెబ్ పేజీ వస్తుంది. అక్కడ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీను క్లిక్ చేయాలి.
ఓటీపీను ఎంటర్ చేసి ప్రోసీడ్ మీద నొక్కండి.
ఇక్కడ ఆధార్ వివరాలతో పాటు గత ప్రామాణికరణ అభ్యర్థనల వివరాలు కూడా వస్తాయి.
ఏదైనా అనుమానాస్పద వినియోగాన్ని గమనిస్తే వెంటనే 1947 నెంబర్ కి కంప్లైంట్ చెయ్యచ్చు. లేదా యూఐడీఏఐ మెయిల్ కి అయినా పంపచ్చు.