మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. ఆధార్ కార్డు చాలా వాటికి అవసరం అవుతూ ఉంటుంది. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు లో చేరడం కుదరదు. ప్రతీ ఒక్క పథకానికి ఆధార్ కావాలి. అలానే బ్యాంక్ ఖాతా తెరవాలన్నా కూడా ఆధార్ కార్డు కావాలి. భారత్ లో ప్రతి ఒక్కరికీ కూడా ఆధార్ కార్డు ని కేంద్రం తప్పనిసరి చేసింది.
దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఆధార్ కేంద్రాల ద్వారా సేవలను ఉంచింది. తాజాగా పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను యూఐడీఏఐ తీసుకొచ్చింది. పిల్లల ఆధార్ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు ని దరఖాస్తు ఫారం లో ఇవ్వాలి. తల్లిదండ్రుల ఇద్దరి ఆధార్ నంబర్ల నమోదుతో పాటుగా ఆ ఇద్దరిలో ఎవరో ఒకటి ఆధార్ బయోమెట్రిక్‌తో కూడిన ఆమోదం తెలపాల్సి వుంది.
5 ఏళ్లలోపు ఆధార్ తీసుకునేందుకు వాళ్ళ డీటెయిల్స్ ని ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే 5 నుంచి 18 ఏళ్ల వారికి అయితే వేరే దరఖాస్తు ఫారం ఉంటుంది. 18 ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తులకు ఇంకో దరఖాస్తు ఫారం ని తీసుకు వచ్చింది. ఇలా మూడు రకాల ఫారంస్ ని తెచ్చింది. వీటి ద్వారా మాత్రమే ఆధార్ కార్డులు పొందాలని అంది. ఫిబ్రవరి 15 నుంచి వీటిని అందుబాటులో ఉంచారు.