బాలివుడ్ నటీనటుల్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాది ప్రత్యేక శైలి. బాలివుడ్ నుంచి హాలివుడ్ కి వెళ్లి అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తూ చివరికి హాలివుడ్ నే అత్తగారిల్లు గా చేసుకుంది. నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.
అయితే, తాజాగా ప్రియాంకా చోప్రా తన గారాల పట్టిని మొదటిసారిగా ప్రపంచానికి చూపించింది. ప్రియాంక తన కూతురు మాల్తి మరియెస్ ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఈ నెల 15 వ తేదీన మాల్తి మొదటి పుట్టిన రోజు జరిగింది.
దీంతో ఏడాది తర్వాత ఫోటోలు రిలీజ్ చేసింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ జొనాస్ సోదరులకు ఇటీవల స్టార్ అవార్డు ప్రదానం చేసింది. ఈ వేడుకలకు ప్రియాంక కూతురు మాల్తితో కలిసి.. హాజరైంది. కూతురిని ఒడిలో కూర్చొబెట్టుకున్న ప్రియాంక ఫొటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరోసారి వీరి ఫోటోలు వైరల్ అయ్యాయి.