Breaking : ఇక నుంచి హైదరాాబాద్ లో ఇంటివద్దకే ఆధార్‌ సేవలు..

-

ఇప్పుడు దేశంలో ఎక్కడికి పోయిన ఆధార్‌ తప్పనిసరైంది. ప్రభుత్వంకు చెందిన ఏ సంక్షేమ పథకానికైనా.. ఇలా ప్రతి ఒక్కచోట ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అయితే రోజు రోజుకు పెరిగిపోతున్న ఆధార్‌ వినియోగంతో ఆధార్‌కార్డు సేవలను మరింత అందుబాటులో తీసుకువచ్చేందుకు పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో చేరనున్న ఐదేండ్ల లోపు పిల్లల ఆధార్‌ వివరాలను వారి ఇండ్ల వద్దనే పోస్టల్‌శాఖ ఉచితంగా నమోదు చేస్తుందని హైదరాబాద్‌ రీజియన్‌ పోస్టాఫీస్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

పిల్లల పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఫొటో, బయోమెట్రిక్‌ తదితర వివరాలను తల్లిదండ్రులు తమ ఇంటి వద్దకు వచ్చిన పోస్టుమ్యాన్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో 1,552 మంది డాక్‌సేవక్‌లు, పోస్ట్‌మ్యాన్‌లు ఆధార్‌ నమోదు సేవల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. అంగన్‌వాడీల ద్వారా పిల్లల ఆధార్‌ నమోదుకు మహిళా శిశు సంక్షేమశాఖతో అంగీకారం కుదుర్చుకొన్నట్టు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version