ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం నాలుగు వారల మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు. ఈ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు లాయర్లు వేసిన పిటీషన్ పై హై కోర్ట్ లో విచారణ జరుగుతోంది. నిన్న హై కోర్ట్ వాదనలు విన్న తర్వాత ఇవాళ్టి వాయిదా వేయడం జరిగింది. తాజాగా సీఐడీ తరపున వాదిస్తున్న ఎ ఎ జి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చంద్రబాబుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదంటూ హై కోర్ట్ లో వాదించారు. చంద్రబాబు లాయర్లు చూపిస్తున్న రిపోర్టులు అన్నీ కూడా అవాస్తవం అని.. వీటిని పరిగణలోకి తీసుకోవద్దని హై కోర్ట్ ను అర్ధిస్తున్నారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు చాలా అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉండడం కారణంగా బెయిల్ ఇవ్వద్దని కోరుతున్నారు పొన్నవోలు.
ఇక ఈ వాదనలను చంద్రబాబు లాయర్ సిద్దార్ధ్ లూథ్రా పూర్తిగా ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్షపూరితంగానే జరిగినట్లు కోర్ట్ కు వినిపించారు. మరి హై కోర్ట్ ఈ బెయిల్ పిటీషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తెలియాల్సి ఉంది.