ఏపీ ప్రభుత్వంపై ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు

-

ఏపీ ప్రభుత్వ సీఎస్ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రిప్లై ఇచ్చారు సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయన్న ఎబి వెంకటేశ్వరరావు.. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు తెలిపారు.

ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని.. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రూల్ నెంబర్ 3 ప్రకారం అధికారులు పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలని.. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయన్నారు.

మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని నేను ఎక్కడా విమర్శించలేదని.. గౌరవానికి భంగం కలిగించేలా నాపై, నా కుటుంబం పై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానని పేర్కొన్నారు. రాజ్యంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని.. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపాని వివరించారు. రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీటును కూడా వివరణలో పేర్కొన్నారు ఏబీవీ.

Read more RELATED
Recommended to you

Latest news