టాలీవుడ్ కు ఒక హీరోగా ప్రేమదేశం సినిమాతో నటుడు అబ్బాస్ పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇక తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. కానీ ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో పోటీ పెరిగిపోవడం తాను కూడా ఇతరత్రా కారణాల వలన ఇండియా వదిలి న్యూజిలాండ్ లో స్థిరపడ్డాడు. కాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ కు వచ్చిన అబ్బాస్ యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఒక దశలో నేను చనిపోవాలనుకున్నాను అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల ప్రకారం అబ్బాస్ అప్పుడు టెన్త్ చదుతున్న సమయంలో, పబ్లిక్ పరీక్షలు పూర్తి అయ్యి ఫలితాలు కూడా వచ్చాయట. కానీ ఆ పరీక్షలలో అబ్బాస్ ఫెయిల్ అయ్యాడట, ఇది తెలిసిన తన లవర్ అతనిని వద్దంటూ ఛీ కొట్టి వెళ్లిపోయిందట. ఆ సమయంలో ఏమి చేయాలో దిక్కుతోచక ఒకేసారి రెండు సమస్యలు రావడంతో తట్టుకోలేక చనిపోవాలనుకున్నానని అబ్బాస్ చెప్పాడు.
కానీ చనిపోవడానికి లారి ఎదురుగా వెళ్లి మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకుని బ్రతికి ఇలా మీ ముందుకు వచ్చానని చెప్పాడు అబ్బాస్. కాగా మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చుపిస్తున్నట్లుగా తెలుస్తోంది.