ఏబీసీ అంటే అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ : అమిత్ షా

-

ధర్మపురి అర్వింద్‌ను రెండోసారి ఎంపీగా గెలిపించండి.. నిజామాబాద్‌లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం పెడతామని, బీడీ కార్మికులకు ఆస్పత్రి కట్టిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ గెలుపునూ కాంక్షిస్తూ ఆదివారం నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మరోసారి అర్వింద్‌ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్‌లో చక్కెర పరిశ్రమలు తెరిపిస్తామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని, రాహుల్, రేవంత్ రెడ్డి పేరుతో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఏబీసీ అంటే అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ బాబా పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. సంవత్సరాల కొద్ది రామమందిర నిర్మాణాన్ని అడ్డుకుంది కాంగ్రెస్సేనని అమిత్ షా నిప్పులు చెరిగారు. ఓటు బ్యాంక్ రాజకీయాలకు భయపడి రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాలేదని మండిపడ్డారు. దేశంలో మావోయిస్టులను కూడా పూర్తిగా అంతమొందిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news