కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 200 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉన్నారని, వారు దేశంలో ఏ ప్రాంతంలో అయినా.. ఏ క్షణంలో అయినా అటాక్ చేసే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. భారత్‌తోపాటు, పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు చెందిన సుమారుగా 150 నుంచి 200 మంది మిలిటెంట్లు ఇండియాలో ఉన్నారని, వారు ఆయా ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది.
భారత ఉపఖండంలో తాలిబన్ల పేరు చెప్పి కార్యకలాపాలు నిర్వహించే అల్-ఖైదా గ్రూపు తీవ్రవాదులు తమ నాయకుడు ఆసిం ఉమర్ మృతికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఉన్నారని వెల్లడైంది. ఈ క్రమంలోనే సదరు గ్రూపు కొత్త లీడర్ ఒసామా మహమూద్ ఆయా ప్రాంతాల్లో సదరు ఉగ్రవాదులతో పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అందిన సమాచారం మేరకు ఐక్యరాజ్య సమితి ఆయా దేశాలను హెచ్చరిస్తోంది.
సదరు 200 మంది తీవ్రవాదులు కేరళ, కర్ణాటకలలోనే ఉండి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. అందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.