బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన క్రమంలో ఆయన తరపు లాయర్ను అనుమతించకపోవడంపై తాజాగా అడ్వొకేట్ సోమ భరత్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు లోపల కుట్ర చేయాలి అనుకోకపోతే అడ్వొకేట్‌ను ఎందుకు వద్దంటున్నారు. కోర్టులో తీర్పు రిజర్వ్‌లో ఉంది.ఈ జడ్జిమెంట్ వచ్చే వరకు ఓపిక పట్టి మాకు టైం ఇవ్వండని ఏసీబీ వాళ్లకు ఒక లెటర్ ఇచ్చాము.
ఈ లెటర్ ఇవ్వడానికి కలిసి వెళ్ళాము.. అడ్వొకేట్ సహాయకుడిగా రావడం అనేది ఫండమెంటల్ రైట్. రాజ్యాంగం ఇచ్చి హక్కును కూడా కాలదన్నే పద్ధతుల్లో మీరు అడ్వకేట్లను తీసుకు రావద్దు అనడం ఏంటి. ఇటీవల కూడా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇవ్వని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు రాసుకున్నారు. సోమవారం అది జరగకూడదని మేము కలిసి వెళ్ళాము. అడ్వకేట్‌ను అసలు ఏసీబీ ఆఫీస్ లోపలికి ఎందుకు రానివ్వ లేదు..దాని వల్ల మీకు నష్టం ఏమిటి?’ అని సోమ భరత్ ఏసీబీ అధికారులను ప్రశ్నించారు.