వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఊహించని పరిణామం చోటు చేసుకుం ది. తాజాగా ఈడీ ఎదుట వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి…హాజరు అయ్యారు. కాకినాడ సెజ్ కేసు లో హాజరు అయ్యారు విజయసాయి రెడ్డి. కాకినాడ పోర్ట్ సెజ్ కేసులో బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం లో విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరయ్యారు.
హైదరాబాద్ లోని ఈడి ఎదుట హాజరు అయిన విజయ్ సాయి రెడ్డి..అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు పై ఈడీ కేసు నమోదు చేసింది. కాకినాడ సెజ్ లో తన వాటాను బలవంతంగా తీసుకున్నారని విజయసారెడ్డి పై ఫిర్యాదు అందింది. దీంతో వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి ఇటీవలే ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరునంలోనే… హైదరాబాద్ లోని ఈడి ఎదుట విజయ సాయి రెడ్డి…హాజరు అయ్యారు.