లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సిఐ, ఏఎస్ఐ…!

-

ఒకవైపు దేశంలో కరోనా తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే… మరోవైపు అవినీతి పనులను కొందరు అధికారులు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలకు ఎంతో రక్షణ కల్పించిన పోలీసులు కూడా ఇలాంటి అవినీతి పనులకు పాల్పడుతున్నారు. ఇది నిజంగా బాధపడాల్సిన విషయం. లాక్ డౌన్ సమయంలో వారి ప్రాణాలకు తెగించి మరీ, ప్రజల ప్రాణాలను కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా వారి నిర్వహణ నిర్వర్తిస్తూనే ఉన్నారు.

acb
acb

అయితే  తాజాగా రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ పోలీస్ స్టేషన్ కు చెందిన సిఐ, ఏఎస్ఐ అవినీతి నిరోధక శాఖ వేసిన స్కెచ్ కు దొరికారు. ఓ వ్యక్తి దగ్గర భూమి విషయం సంబంధించి లంచం తీసుకుంటూ వారిద్దరు అడ్డంగా దొరికిపోయారు. వారు సదరు వ్యక్తి నుండి లక్ష ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా ఏఎస్ఐ, సిఐ ని అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో అవినీతి అధికారులు ఇంకా సోదరులు జరుపుతూనే ఉన్నారు. అంతే కాకుండా ఇంకా ఎవరికైనా ఈ విషయంలో హస్తం ఉందేమో అన్న విషయంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news