ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కేసు నమోదు కాగా.. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని చేర్చింది ఏసీబీ.
గత ప్రభుత్వం హయాంలో ఈ ఫార్ములా రేస్ కోసం విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా రేసు నిధుల బదలాయింపు పై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఈ ఫార్ములా కార్ రేస్ నిర్వహణకు సంబంధించి రూ.50 కోట్ల చెల్లింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి దాదాపు నెల రోజుల క్రితమే గవర్నర్ నుంచి అనుమతి కోరింది రేవంత్ సర్కార్. తాజాగా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది.