లంచావతారి జగజ్యోతికి రిమాండ్ విధించింన ఏసీబీ

-

లంచం తీసుకుంటూ చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ అధికారి జగ జ్యోతిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందు అధికారులు ఆమెను రిమాండ్ తరలించేందుకు సిద్ధం చేయగా ఛాతి నొప్పంటూ ఏసీబీ అధికారులకు జ్యోతి చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. ఆమెను ఉస్మానియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన జడ్జి.. మార్చి 6 వరకు జ్యోతికి రిమాండ్ విధిస్తున్నట్లు వెల్లడించారు. ఆమెను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించాలని ఆదేశించారు.

కాగా ,ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు రూ.15 కోట్ల విలువ చేసే ఆస్తులను గుర్తించారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు.. 4 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా వ్యవసాయ భూములు, ప్లాట్లు ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version