ఏపీలో రక్తమోడుతున్న రహదారులు.. నలుగురు మృతి !

-

అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో కియా కార్ల పరిశ్రమ వద్ద  రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికి అక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నట్టు చెబుతున్నారు. వీరు బెంగళూరు యశ్వంత్పూర్ నుండి హైదరాబాద్ వెళుతున్నట్టు గుర్తించారు పోలీసులు.

మరో పక్క నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కల్వర్టు వద్ద రహదారిపై రోడ్డు కుంగి ఉండటంతో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో  11 మందికి గాయాలు అయినట్లు సమాచారం. దీంతో క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన రెండు 108 వాహనాల సహాయంతో  చికిత్స నిమిత్తం బద్వేలు లోని ఆసుపత్రికి తరలించారు. ప్రొద్దుటూరు నుంచి వినుకొండ వెళ్లే కారు, గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లే కారు ఎదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version