ఆ ఓవ‌ర్‌త్రోకి 5 ర‌న్సే.. 19.8 రూల్ ప్ర‌కారం న్యూజిలాండ్‌దే క‌ప్..!

-

ఇప్పుడు ఎవరిని అడిగినా.. మ్యాచ్ లో ఎవరు గెలిచారు అంటే ఇంగ్లండ్ అని చెబుతారేమో కానీ.. నిజానికి నైతికంగా గెలిచింది న్యూజిలాండే. న్యూజిలాండ్ దే కప్పు అంటూ క్రికెట్ అభిమానులు కుండలు బద్ధలు కొడుతున్నారు.

క్రికెట్ అంటే ఇష్టం లేకున్నా సరే. క్రికెట్ అంటే నచ్చకున్నా సరే. నిన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చివరి మూడు నాలుగు ఓవర్ల మ్యాచ్ చూస్తే మస్తు మజా. దాన్ని మజా అనడం కన్నా.. నరాలు తెగ ఉత్కంఠ. ఊపిరి బిగపట్టుకోని మరీ.. ప్రపంచమంతా ఇంగ్లండ్ చివరి రెండు ఓవర్లలో చేసే బ్యాటింగ్ ను చూసింది.

ఇప్పుడు ఎవరిని అడిగినా.. మ్యాచ్ లో ఎవరు గెలిచారు అంటే ఇంగ్లండ్ అని చెబుతారేమో కానీ.. నిజానికి నైతికంగా గెలిచింది న్యూజిలాండే. న్యూజిలాండ్ దే కప్పు అంటూ క్రికెట్ అభిమానులు కుండలు బద్ధలు కొడుతున్నారు. ఇంగ్లండ్ గెలిస్తే.. న్యూజిలాండ్ గెలిచింది అని చెప్పడం ఏంటి. 2015లో ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచింది. అక్కడితోనే వరల్డ్ కప్ గురించి మాట్లాడటమే బంద్ చేశారు.

కానీ.. ఈ వరల్డ్ కప్ అలా కాదు. మ్యాచ్ ముగిసినా ఈ వరల్డ్ కప్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది. దానికి కారణం ఒకే ఒక ఓవర్ త్రో. అవును.. ఓవర్ త్రోనే న్యూజిలాండ్ కొంప ముంచిందా? హా.. ముంచిందనే చెప్పాలి. చివరి ఓవర్ లో ఓవర్ త్రో వల్ల ఇంగ్లండ్ ఆరు పరుగులు వచ్చాయని అందరికీ తెలుసు.

కానీ.. నిజానికి ఆరు పరుగులు ఇవ్వాల్సిందేనా? ఓవర్ త్రో కు ఐదు రన్సే ఇవ్వాలి? ఆరు ఎలా ఇస్తారు. ఐదు రన్స్ ఇచ్చి ఉంటే… న్యూజిలాండ్ గెలిచేదే. న్యూజిలాండ్ దే కప్పు. ఆరు పరుగులు ఇవ్వడం వల్లనే మ్యాచ్ టై అంది అంటున్నారు.

అయితే.. దీనికి ఓ రూల్ ఉందండోయ్. అదే.. 19.8 రూల్. ఈ రూల్ ఏం చెబుతుందంటే… ఓవర్ త్రో రూపంలో బంతి బౌండరీ వెళ్లినా.. ఫీల్డర్ కావాలని అడ్డుకున్నప్పుడు బంతి బౌండరీ చేరినా… ఆ రూల్ ను వర్తింపజేస్తారు.

ఆ రూల్ ప్రకారం చూస్తే.. ఇంగ్లండ్ కు వచ్చేది ఐదు పరుగులే. కానీ.. అంపైర్ ధర్మసేన మాత్రం ఇంగ్లండ్ కు ఆరు పరుగులు ఇచ్చాడు.

ఆ రూల్ లోని ఓ క్లాజ్ ఏం చెబుతోందంటే… ఇద్దరు ఆటగాళ్లు రన్ చేస్తున్నప్పుడు… ఫీల్డర్ బంతిని అందుకొని త్రో వేసే లోపు వాళ్లు రెండో రన్ తీయలేదు.

అంటే బంతి ఫీల్డర్ చేతికి పడి.. ఫీల్డర్ బంతిని విసిరేసే లోపు వాళ్లు తీసింది ఒక్క పరుగే. తర్వాత రెండో పరుగు తీశారు. ఆ సమయంలోనే బంతి ఓవర్ త్రో అయి బౌండరీకి చేరింది. దీని వల్ల వాళ్లు చేసిన రెండు పరుగులు, బౌండరీ దాటినందుకు 4 పరుగులు.. మొత్తం కలిపి 6 పరుగులను అంపైర్ ఇచ్చాడు. కానీ.. వాళ్లు తీసిన ఒక పరుగును కౌంట్ చేసి.. రెండో పరుగు తీస్తున్నప్పుడు బౌండరీ వెళ్లిన దాన్ని కౌంట్ చేస్తే… 1 + 4 = 5 పరుగులు మాత్రమే ఇవ్వాలి.

ఏది ఏమైనా.. ఇంగ్లండ్ కు ఆ ఓవర్ త్రో వల్ల 6 పరుగులు రావడం.. దాన్ని వల్ల మ్యాచ్ టై అవడం.. సూపర్ ఓవర్.. ఆ సూపర్ ఓవర్ లోనూ మ్యాచ్ టై అవడం.. ఆ తర్వాత బౌండరీల ఆధారంగా విశ్వ విజేతను డిసైడ్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో చివరి క్షణంలో కప్పును చేజార్చుకున్న బాధలో న్యూజిలాండ్ ఆటగాళ్లు ఉంటే.. చివరి క్షణంలో కప్పును ముద్దాడిన ఆనందంలో ఇంగ్లండ్ టీం మునిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version