ఆచార్య స్పీక్స్ నౌ : పూజా ఓకే రెజీనా నాట్ ఓకే !

-

ఓ విధంగా ఊర మాస్ సినిమా కాదు. నేను నాదైన స్టైల్ తో మ్యాన‌రిజ‌మ్స్ తో చేయ‌డానికి.. అయినా నా ఈజ్ మాత్రం మిమ్మ‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. ఈ క‌థ న‌న్ను అంత‌గా ప్ర‌భావితం చేసింది అని చెప్పారు చిరు. కానీ ఈ సినిమాలో అందం మిస్ అయింది. అందాల భామ‌లలో కూడా అందం మిస్ అయింది. అందం అంటే కేవ‌లం స్క్రీన్ ప్రెజెన్స్ అనే కాదు క్యారెక్ట‌ర్ ఎసెన్స్ అని..! ఆ విధంగా అందాల పూజ కొంత ప‌ర్లేదు.. సానా క‌ష్టం పాట‌లో రెజీనా ఎపీరియెన్స్ అస్స‌లు బాలేదు..ఆ విధంగా ఇద్ద‌రూ నిరాశ ప‌రిచారు. అస‌లీ సినిమాకు ఐట‌మ్ సాంగ్ ఎందుక‌ని ? మంచి సీరియ‌స్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీకి రెజీనా ఎప్పీరియెన్సే ఓ అడ్డంకి !

ఈ నేప‌థ్యాన ఆచార్య సినిమా ఇవాళ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌యింది. మిశ్ర‌మ స్పంద‌నల నేప‌థ్యంలో సినిమా ఫ‌లితం ఉంది. మొదట్నుంచి ఈ సినిమా పై భారీ అంచ‌నాలే ఉన్నా కూడా, వాటిని అందుకోలేక‌పోవ‌డం ఓ విధంగా కొర‌టాల‌కు మైన‌స్. చిరంజీవి ఈ వ‌య‌సులో కూడా కొడుకు, మెగా ప‌వ‌ర్ స్టార్ రాం చ‌ర‌ణ్ తో పోటీగా న‌టించ‌డం నిజంగానే అభినంద‌నీయం. గ‌త చిత్రాల‌తో పోలిస్తే శివ రాసుకున్న క‌థ అంత విస్తృత రూపంలో లేద‌ని తేలిపోయింది అని ఇంకొంద‌రు నెగిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు.

ట్విట‌ర్ లో కూడా భిన్న వాద‌న‌లే న‌డుస్తున్నాయి. వాస్త‌వానికి ఈ సినిమా శ్రీ‌మంతుడు 2 అవుతుంద‌ని అంతా అనున్నారు. ఆశ‌లు పెట్టుకున్నారు కానీ ఆ విధంగా సినిమా లేద‌ని తెలుస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ క‌థ‌ల ఎంపిక, పాత్ర‌ల‌ను తీర్చిదిద్దే తీరు, ఆయ‌న రాసుకునే విధానం ఇవ‌న్నీ గ‌తం క‌న్నా ఇప్పుడు కొంచెం కాదు బాగా త‌గ్గాయి అని శివ విష‌య‌మై చెప్ప‌వ‌చ్చు. ఈ విధంగా చెప్ప‌డం త‌ప్పు కాదు. మ‌రీ! ఆహా ఓహో సాహో అని రాయ‌డం వ‌ల్ల ఓ సినిమా స్థాయిని ఇప్ప‌టికిప్పుడు పెంచ‌వ‌చ్చు కానీ వాస్త‌వాలు చెప్ప‌క పోవ‌డం వ‌ల్ల ఆడియెన్స్ తిట్టుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అందుక‌ని కొర‌టాల శివ త‌న దైన శైలిలో క‌థ ఎంచుకున్నా రాసుకున్నా కూడా ఎందుక‌నో ఆయ‌న వెన‌క‌బ‌డ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version