వైఎస్ మృతి వెనుక జగన్ హస్తముందని…టీడీపీ సీనియర్ నేత అయ్యన్న సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై అయ్యన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తముందని… వైఎస్ విజయలక్ష్మి, జగన్ తీరు దొంగే..దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ నీ అంత డిగ్నిఫైడ్ గా మాట్లాడటం మా లోకేష్ కి రాదు బొత్స సత్తిబాబు అంటూ చురకలు అంటించారు అయ్యన్న.
సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం అని చిల్లరగా మాట్లాడి మంత్రిగా ఫెయిల్ అయిన నీ లాంటి వాళ్ళ పై దాడులు జరిగితే కడుపుమంట అనుకోవడంలో తప్పులేదన్నారు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేష్ ని చూసి అక్కసు తో గ్యాస్ ఎక్కువై జగన్ పంపిన రౌడీలు రాళ్ళు విసిరితే కడుపుమండి ఎవరో చేసారని కవరింగ్ ఎందుకు బొత్సా? అని నిలదీశారు. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న చేసిన ఈ ట్వీట్.. ఏపీ రాజకీయాల్లో మరో చర్చకు దారితీస్తోంది. దీనిపై వైసీపీ పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి.