భారత్ లో యాసిడ్ దాడులు 5 ఏళ్ళల్లో ఎన్నో తెలిస్తే…!

-

యాసిడ్ దాడులు; ప్రేమించలేదని, తమ మాట వినలేదని, తామ కోరికలు తీర్చలేదని, యాసిడ్ దాడులు చేస్తూ ఆడవాళ్ళ జీవితాలను నిలువునా చీలుస్తూ ఉంటారు. ఎందరో జీవితాలు యాసిడ్ దాడికి బలైపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ ఇండియా టుడే డేటా ఇంటెలిజెన్స్ యూనిట్ (డిఐయు) యాసిడ్ దాడులకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టింది.

2014 మరియు 2018 మధ్య కాలంలో దేశంలో 1,483 మంది యాసిడ్ దాడులకు గురైనట్లు గుర్తించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన డేటా ప్రకారం ఈ లెక్క తేల్చారు. 319 మంది బాధితులలో, 2017 సంవత్సరంలో ఈ ఐదేళ్లలో అత్యధికంగా 309 యాసిడ్ దాడులు జరిగినట్టు గుర్తించారు. 2017 మరియు 2018 సంవత్సరాల్లో మొత్తం 596 యాసిడ్ అటాక్ కేసులు నమోదయ్యాయి,

623 మంది బాధితులు ఈ దాడుల్లో బలైపోయారు. కాని ప్రతి సంవత్సరం 149 మంది మాత్రమే చార్జిషీట్ లో నమోదు అయ్యారని నివేదిక చెప్తుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగిన సంఘటనల సంఖ్య కంటే సగానికి పైగా తక్కువగా ఉంది. 2014 లో అతి తక్కువ కేసులు (244) నమోదయ్యాయి, 201 మంది చార్జిషీట్ వేసారు. 2014 నుండి 2018 వరకు యాసిడ్ దాడుల విషయంలో ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీ సహా,

10 స్థిరంగా ఉన్నాయి. ఈ ఐదేళ్ళలో భారతదేశంలో యాసిడ్ దాడులకు గురైన వారిలో ఈ మూడు రాష్ట్రాల్లో 42 శాతం దాడులు జరిగాయి. 2015 సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. 734 కేసులను ఈ ఒక్క ఏడాదిలో నమోదు చేసారు. విచారణకు వెళ్ళిన 734 కేసుల్లో 33 మాత్రమే పూర్తయ్యాయి. కేసులు నమోదు అవుతున్నా సరే విచారణ మాత్రం జరగడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news