భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం : మంత్రి సీతక్క

-

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ…. ప్రతిసారీ వన దేవతలను గద్దెలపైకి తీసుకొచ్చేటప్పుడు తాను ఉంటున్నానని అన్నారు.ఈసారి తన ఆధ్వర్యంలో తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని ,మేడారం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

వన దేవతలను దర్శించుకునే సమయంలో క్యూలైనల్లో బాటిళ్లు ఇస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రోడ్లు, బస్సులు, త్రాగునీరు సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని అన్నారు. ఇక ఈరోజు సాయంత్రం సారలమ్మ గద్దెపై కొలువుతీరనుందని…. ఈ మహోత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.మేడారం మహా జాతరకు తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారని మంత్రి సీతక్క తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news