డెబిట్ కార్డ్ లేదా..? ఆధార్‌తోనే యూపీఐ ని యాక్టివేట్ చేసేయండి..!

-

సరైన ఏటీఎం కార్డ్ లేదంటే గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ ని వాడలేము.
మీకు కూడా అదే సమస్యా..? అయితే మీకు ఓ శుభవార్త. ఏటీఎం కార్డ్ లేకుండానే యూపీఐ యాప్స్ వాడుకునేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవకాశాన్ని ఇస్తోంది.

దీనికి ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఇక పూర్తి వివరాలని చూస్తే… ఆధార్ ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ అథెంటికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. గతం లో యూపీఐ యాక్టివేట్ చేసుకునేందుకు వాలిడి డెబిట్ కార్డు ద్వారా ఓటీపీ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు మరొకటి తెచ్చింది బ్యాంకు. ఇక మరి ఎలా యాక్టివేట్ చెయ్యచ్చనేది చూసేద్దాం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధార్ ద్వారా యూపీఐ యాక్టివేట్ విధానంపై ట్వీట్ చేయడం జరిగింది. యూపీఐ రిజిస్ట్రేషన్ కోసం ఇక పై డెబిట్ కార్డ్ అక్కర్లేదు. ఆధార్ కార్డుతోనే యూపీఐ సేవలను వాడచ్చు. https://bit.ly/3V9NOw3 ద్వారా పూర్తి వివరాలని చూడచ్చు. యూపీఐ సేవలను పొందాలంటే ఆధార్ ఆధారిత ఓటీపీ ఓ చక్కటి మార్గం. ఎవరికైతే డెబిట్ కార్డు లేదో వాళ్ళు ఆధార్ తో యూపీఐ సేవలు ని పొందొచ్చు. ఆధార్ ఓటీపీతో యూపీఐ పేమెంట్స్ సేవలని పొందొచ్చు.

ఇక ఈ సేవలని ఎలా పొందచ్చనేది చూసేద్దాం..

దీని కోసం ముందు యూపీఐ యాప్‌లోకి వెళ్లి సెట్ న్యూ యూపీఐ పిన్ ని ఎంపిక చెయ్యండి.
ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ని సెలెక్ట్ చేసుకోండి.
తర్వాత పాపప్ విండో లో మీరు యాక్సెప్ట్ చెయ్యండి.
ఆ తర్వాత ఆధార్ కార్డు పై ఉన్న చివరి 6 అంకెలను ఎంటర్ చేసేయండి.
ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేసేయండి. మళ్లీ యాక్సెప్ట్ చేసేయండి.
కొత్త యూపీఐ పిన్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news