తిరుమల శ్రీ వారిని ప్రముఖ సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. బుల్లెట్ అనే సినిమాలో తాను గెస్ట్ రోల్ చేస్తున్నానని తెలిపారు. మాట్రాం సోషియల్ కమ్యూనిటీ ప్రారంభించానని.. దాని ద్వారా సేవ చేస్తున్నానని వెల్లడించారు. అన్నింటికీ ఆ దేవుడే కారణం.. ఆయన దయతోనే ఇదంతా చేయగలిగాను అని లారెన్స్
పేర్కొన్నారు.