Rajababu: టాలీవుడ్ లో విషాదం.. ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ క‌న్నుమూత‌

-

Rajababu: టాలీవుడ్ లో మరో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయ‌న ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటు బుల్లితెర‌, అటు వెండి తెర న‌టించి తనకంటూ ప్రత్యేక స్థానం ద‌క్కించుకున్నాడు రాజబాబు. ఆయ‌న‌కు భార్య.. ఇద్దరు అబ్బాయిలు.. ఒక అమ్మాయి ఉన్నారు.

రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చిన్న‌త‌నం నుంచి న‌ట‌న‌పై ఆస‌క్తి పెంచుకున్నాడు. రంగస్థలం మీద నటించడం చాలా ఇష్టం. ఇలా నాట‌కాలు వేస్తూ దేశమంతా తిరిగారు. ఈ క్రమంలో 1995లో వచ్చిన ‘ఊరికి మొనగాడు’ చిత్రంతో రాజబాబు నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు.సిందూరం సినిమా తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇలా సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, కళ్యాణ వైభోగం, మళ్ళీ రావా ?, శ్రీకారం , బ్రమ్మోత్సవం, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో న‌టించారు.

ఇటు బుల్లితెర మీద కూడా న‌టించి మెప్పించాడు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. 2005వ సంవత్సరంలో “అమ్మ ” సీరియల్ లోని పాత్రకు నంది అవార్డు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news