మధ్యప్రదేశ్ లో దారుణం…సంతానం కోసం వేశ్యల నరబలి..!

మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. తమకు సంతానం కలగటం లేదని ఓ జంట ఇద్దరు వేశ్యలను నరబలి ఇచ్చింది. వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో నివసిస్తున్న మమతా, బంటు దంపతులకు పెళ్లి జరిగి పద్దెనిమిదేళ్లు అవుతోంది. వీరికి ఇప్పటివరకు సంతానం కలగలేదు. అయితే బంటు మిత్రుడు నీరజ్ పర్మార్ భూత వైద్యుని వద్దకు వెళ్లాలని సలహా ఇచ్చారు. అతడి సలహామేరకు భూతవైద్యుడు గిల్వార్ యాదవ్ ను దంపతుల సంప్రదించారు. సంతానం కలగాలంటే నరబలి ఒకటే మార్గమని భూతవైద్యుడు దంపతులకు చెప్పాడు.

crime
crime

దాంతో నరబలి కోసం వ్యక్తిని తీసుకువచ్చే పనిని బంటు …నీరజ్ కు అప్పచెప్పాడు. నీరజ్ నరబలి కోసం ఓ వేశ్య ను తీసుకువచ్చి హతమార్చాడు. అయితే మృతదేహాన్ని బండి పై తీసుకు వెళ్తుండగా భయపడి అక్కడే వదిలేసి పారిపోయాడు. అనంతరం మరో వేశ్య ను తీసుకువచ్చి పూజలు చేసి నరబలి ఇచ్చారు. రోడ్డుపై వదిలివెళ్లిన వేశ్య మృతదేహం పై పోలీసులకు సమాచారం అందడంతో విచారణ జరిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.