టాలీవుడ్‌ లో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటి కే చాలా మంది ప్రముఖులు మృతి చెందగా… తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ రాజ బాబు మృతి చెందారు. 64 సంవత్సరాలు ఉన్న ప్రముఖ నటుడు రాజబాబు…. గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్నారని సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యం లో రాజ బాబు ఆరోగ్యం విషమించడంతోనే మరణించారు. రాజ బాబు నిన్న అర్ధ రాత్రి నిద్రలోనే మృతి చెందినట్లు ఆయన… కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా నరసాపుర పేట లో జన్మించిన నటుడు రాజ బాబు… 1995 సంవత్సరం లో ” ఊరికి మొనగాడు సినిమా తో టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ లోకి అడుగు పెట్టారు.

ఆ తర్వాత.. మురారీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మళ్లీ రావా ?, బ్రహ్మోత్సవం, భరత్‌ అనే నేను.. ఇలా ఏకంగా 62 సినిమాల వరకు చేశారు రాజ బాబు. అభిషేకం, మనసు మమత, అమ్మ, నా కోడలు బంగారం, చిలసౌ లాంటి సీరియళ్ల లోనూ నటించారు రాజ బాబు. ఇక రాజ బాబు మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.