ఆస్కార్ బరిలో బాలీవుడ్ నటి ?

-

డైరెక్టర్ సంజయ్ లీలా బాన్సాలి రూపొందించిన “గంగుబాయి కతియావాడి” చిత్రంలో నటించి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది అలియా భట్. లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శించబడింది. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, హ్యూమా ఖురేషి తదితరులు ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించారు. ఈ సినిమాలో అలియా భట్ వేశ్య పాత్రలో నటించింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. అయితే తాజా అప్డేట్ ప్రకారం ” గంగూబాయి కతియావాడి” ఆస్కార్ బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. భారతీయ సినిమాలనుంచి గంగూబాయి కతియా వాడి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రేసులో ఉన్న సినిమాలకు ఆలియా భట్ సినిమా గట్టి పోటీ ఇస్తుందని టాక్ వినిపిస్తుంది. వాస్తవికత ప్రతిబింబించేలా తెరకెక్కించడం వల్ల ఆస్కార్ లభించే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్ భావిస్తోంది. ఏది ఏమైనా పిన్నవయసులోనే ఆలియా తనదైన పందాలో పయనిస్తూ అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version