ఏపీలో సంక్రాంతి వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. కోడి పందాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే.. సంక్రాంతి అంటే కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పోటీలు చూసుంటాం.. కానీ పందుల పందాలు చూశారా..? అవును… ఇప్పుడు ఏపీలో పందుల పందాలు కూడా కొనసాగుతున్నాయి.
కోడి పందాలకు ఏ మాత్రం తగ్గకుండా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో వరాహ పోటీలు నిర్వహణ చేస్తున్నారు. దీంతో పందుల పోటీలకు పోటెత్తారు పందెం రాయుళ్లు. వరహాల పందాలపై కోట్ల రూపాయలు బెట్టింగులు వేస్తున్నారు. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్నారు నిర్వాహకులు.
సంక్రాంతి పండుగకు కోడి పందాలు ఫేమస్ కానీ పందుల పందాలు చూశారా!
తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో పందుల పోటీలు నిర్వహిస్తున్న పందెం రాయుళ్లు
పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు pic.twitter.com/BmJGBWYbCC
— Telugu Scribe (@TeluguScribe) January 14, 2025