Hansika : ట్రెండీ ఔట్​ఫిట్​లో కవ్విస్తున్న యాపిల్ బ్యూటీ హన్సిక

-

యాపిల్ బ్యూటీ హన్సిక పెళ్లి తర్వాత సూపర్ గ్లామరస్​గా తయారయింది. తాజాగా ఈ బ్యూటీ ట్రెండీ ఔట్​ఫిట్​లో కనిపించి మాయ చేసింది. గ్రీన్ కలర్ సూట్​లో సూపర్ కూల్ లుక్స్​తో అదరగొట్టింది. గ్రీన్ కలర్ బ్లేజర్.. అండ్ షార్ట్​తో నడుం అందాలు చూపించీ చూపించకుండా దోబూచులాడింది. ఈ ఔట్​ఫిట్​లో హన్సిక క్లాసీగా కనిపిస్తోంది.

హన్సిక ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ భామ పెళ్లి తర్వాత ఇంకా అందంగా తయారైందంటూ మాట్లాడుకుంటున్నారు. సూట్​ హన్సుకు బాగా సూట్ అయిందంటూ గారాలు పోతున్నారు. అందంతో చంపేయకు పిల్లా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ న్యూ లుక్​లో హన్సిక స్టైల్ అదిరిందంటూ లవ్, ఫైర్ ఎమోజీస్​తో తమ ప్రేమను నింపేస్తున్నారు.

ఇక హన్సిక సినిమాల విషయానికి వస్తే ఈ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్టుగా తన సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​తో దేశ ముదురు సినిమాలో నటింటి టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో వైశాలిగా కుర్రాళ్ల మనసు దోచేసింది. ఇక ఆ తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ్​లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అయితే హన్సిక గత కొన్నేళ్లుగా తెలుగులో ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా చేయలేదు. దీంతో ఫ్యాన్స్ త్వరగా తెలుగు తెరపై కనిపించమంటూ రిక్వెస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version