మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద యూపీ లోని రాంపూర్ ట్రయల్ కోర్టులో లొంగిపోయారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఆమెకు కోర్టు పలుమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు పలు మార్లు ఆదేశాలు జారీ చేసింది.ఫిబ్రవరి 27న ఆమెకు సీఆర్పీసీ 82 కింద మరో నాన్ బెయిలబుల్ వారెంట్‌ను కోర్టు జారీ చేసింది. ఆమె స్పందించక పోవడంతో పరారీలో ఉన్నట్లు ప్రకటించిన కోర్టు వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా జయప్రద రామపుర్ ట్రయల్ కోర్టులో లొంగిపోయారు.
జయప్రద సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.దీంతో న్యాయపరంగా చిక్కుల్లో చిక్కుకున్నారు. మొత్తానికి సోమవారం రాంపూర్ ధర్మాసనం ముందు లొంగిపోయారు.