పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.సోషల్ మీడియా వేదికగా రోజూ ఇరు పార్టీల కార్యకర్తలు పోస్టుల యుద్ధం చేస్తున్నారు.బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డిపై,కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తరచూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదని ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి ఇటీవల దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే దావత్ లో మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి తడబడుతూ మాట్లాడారు .ఇక దీనిపై అప్పటి నుంచి టిఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఈ ట్రోల్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గుంటూరు, గుడివాడలో చదువుకొని వచ్చిన వాళ్లు తనకు ఇంగ్లిష్ రాదంటూ అవహేళన చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోలేదు అని అన్నారు. గుంటూరు, గుడివాడలో అసలే చదవలేదు అని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీలో ఎవరికీ ఇంగ్లిష్ రాకపోయినప్పటికీ కూడా ప్రపంచంతో పోటీ పడి అభివృద్ధి చెందుతున్నారు అని అన్నారు. ఇంగ్లిష్ అనేది ప్రపంచంలో ఉపాధి లభించడానికి ఉపయోగపడే ఒక భాష మాత్రమే’ అని cm రేవంత్ రెడ్డి తెలిపారు.