Kajol: అందం, అభినయంతో పుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ కాజోల్. కేవలం నార్త్ ఇండియాలోనే కాకుండా .. సౌత్ ఇండియాలో కూడా పిచ్చా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అందాల తార కాజోల్. నాలుగు పదుల వయస్సులోనూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ.. బాలీవుడ్లో దూసుకపోతుంది. బాలీవుడ్ సింగం, సార్ట్ హీరో అజయ్ దేవగణ్ ను పెళ్లి చేసుకున్న తరువాత కూడా తన కేరీర్ ను సక్సెస్ గా కొనసాగిస్తుంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను చేస్తుంది. సక్సెస్ పుల్ గా తన కేరిర్ లో రాణిస్తుంది.
ఇదిలా ఉంటే..కాజోల్ తన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ విషయంలో ప్రయోగాలు చేస్తుంటుంది. ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌కు స్పెషల్ డిజైన్ గౌను వేసుకుని సందడి చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
కానీ, కొంత మంది నెటిజన్లకు ఆమె నచ్చకపోవడంతో నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. కాజోల్ తాజాగా దుబాయ్ లో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌కి హాజరైంది. బాడీ-కాన్ బ్లాక్ గౌన్ ధరించి, అలాగే.. చెప్పులు కూడా చాలా ఎక్కువ హీల్ ఉండడంతో ఆమె నడవడానికే ఇబ్బంది పడింది.
ఎలాగోలా రెడ్ కార్పెట్‌పై నడుకుంటూ స్టేజ్ వరకు చేరుకుంది. కానీ.. ఆమె ధరించిన డ్రెస్ ఏ మాత్రం నెటిజన్లకు నచ్చలేదు.
దీంతో నెటిజన్లు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు. ‘బైక్ కవర్ వేసుకొచ్చిందంటూ’ విపరీతంగా కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ ‘ఆ డ్రెస్ దుప్పటిలా ఉందని.. అవార్డు రాకపోతే అది కప్పుకొని పడుకోవచ్చని’ కామెంట్ చేశాడు. డిజాస్టర్ కాస్ట్యూమ్ అని మరికొందరూ ట్రోల్ చేస్తున్నారు.
డ్రెసింగ్ విషయంలో హీరోహీరోయిన్లు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. తేడా కొట్టిన ఇలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. ఈ మధ్యనే షాహిద్ కపూర్ భార్య ముంబై విమానాశ్రయం నుండి వచ్చే వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. పొట్టి నిక్కరులో షాహిద్ భార్య రావడంపై నెటిజన్లతో సహా ఆయన అభిమానులు విపరీతంగా ట్రోల్ చేశారు.