ఏపీకి వర్ష సూచన.. నేడు, రేపు వర్షాలు

-

ఏపీలో మరోమారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది. నైరుతి బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళనాడు, శ్రీలంకల మధ్య ప్రాంతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా సముద్రం మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా రాష్ట్రమంతటా తూర్పు నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు చాలా చోట్ల మోాస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చిరస్తోంది.

దీంతో పాటు నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వానలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు నవంబర్ రెండో వారంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.అయితే ఇది ఏపీ వైపు వచ్చే అవకాశం ఉందా.. లేకపోతే దిశ మార్చుకునే అవకాశం ఉందా అనేదానిపై స్పష్టత లేదంటున్నారు. ఇదే జరిగితే ఏపీలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో విపరీతంగా వాయుగుండాలు, తుఫానులు ఏర్పడుతాయి. వీటి వల్ల కోస్తా, తమిళనాడు కోరమండల్, ఒడిశా తీరాలు తుఫానులతో తీవ్రంగా దెబ్బతింటుంటాయి. తుఫానులు ఈ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. దీంతో బంగాళా ఖాతాన్ని అనుకుని ఉన్న జిల్లాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతుంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news