నటుడు విశాల్ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మదగజరాజ ఈవెంట్ లో ఆయన వణుకుతూ కనిపించారు. ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు చిత్ర యూనిట్ చెప్పినప్పటికీ కొందరూ ఆయన ఆరోగ్యం పై ఆరా తీస్తూనే ఉన్నారు. ఈ తరుణంలోనే ఖుష్బూ క్లారిటీ ఇచ్చారు.
వాస్తవానికి విశాల్ ఢిల్లీలో ఉన్నప్పుడే జ్వరం వచ్చిందని.. ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ మదగజరాజ సినిమా 11 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతుందని అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్ కి వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగాను. 11 ఏళ్ల తరువాత ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కచ్చితంగా రావాలనుకున్నట్టు తెలిపారు. 103 డిగ్రీల జ్వరం కారణం వణికిపోయారని వివరించారు. ఆ ఈవెంట్ పూర్తి కాగానే వెంటే విశాల్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు వివరించింది ఖుష్బూ.