కూతురుతో సహా హీరోయిన్ మిస్సింగ్.. షాక్ లో ఇండస్ట్రీ..!

-

ఒక్క సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. మంచి పేరు తెచ్చుకొని.. ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ నర్మద. ఆ తర్వాత తమిళనాడులోని తారాపురానికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని.. సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఇంతకాలం ఆమె గురించి ఎలాంటి వార్తలు లేవు. కానీ, ఇప్పుడు తాజాగా ఆమె గురించి ఒక వార్త బయటకి వచ్చింది. అదేంటంటే.. నర్మద తన 15 ఏళ్ల కుమార్తెతో సహా కనిపించకుండా పోయిందని. ఆమె భర్త, బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు.

దీంతో నర్మద భర్త గురువారం తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇకపోతే 1987లో “చిన్న పూవే మేల్ల” అనే సినిమాతో హీరోయిన్‎గా నర్మద పరిచయం అయింది. ఈ సినిమాలో సిందూర పువ్వు’ ఫేమ్ రాంకీతో పాటు చంద్రముఖి ఫేమ్ ప్రభు హీరోలుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version