4 ఆకుల మొక్క 4 లక్షలు.. ఇది చాలా కాస్ట్లీ మొక్క గురూ..!

-

అది పేరుకు మాత్రమే మొక్క.. కానీ, దాని రేంజ్ అంతా హై లెవల్. నిజానికి ఒక మొక్క ధర మహా అయితే 40 రూపాయలు లేదా 400 రూపాయలు ఉంటుంది. కానీ, ఇప్పుడు నేను చెప్పబోయే మొక్క ధర వింటే మాత్రం పక్కా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ మొక్క ధర అక్షరాలా 4 లక్షలు కాబట్టి. కేవలం నాలుగు ఆకులున్న ఫిలోడెండ్రాన్ మినిమా జాతికి చెందిన ఈ మొక్కను ఇటీవల ట్రేడ్‌ మి అనే ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ వేలానికి ఉంచింది. వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి నాలుగు లక్షల రూపాయలు చెల్లించి ఆ మొక్కను కొనుగోలు చేశాడు.

ఇంతవరకూ ఒక మొక్కకు వచ్చి గరిష్ట ధర ఇదేనట. ఇది ‘ఉష్ణమండల స్వర్గం’ అని దాన్ని కొన్న వ్యక్తి అభివర్ణించాడు. అలాగే ఈ మొక్కలోని నాలుగు ఆకులు సగం ఆకుపచ్చ, సగం పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి చాలా అరుదుగా సహజంగా సంభవిస్తాయి కనుక వీటిని ఎక్కువగా ఉద్యాన శాస్త్రవేత్తలు, కలెక్టర్లు కోరుకుంటారు… అని తెలిపాడు దీన్ని కొనుగోలు చేసిన అజ్ఞాత వ్యక్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version