నీలాంబరిగా ఆడియన్స్ మదిలో నిలిచిపోయిన సీనియర్ నటి రమ్యకృష్ణ.. ఇప్పుడు యువతరం మదిలో శివగామిగా చెరగని ముద్ర వేశారు. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ కెరీర్లో నటిగా దూసుకెళ్తున్నారు. అయితే ఈ జర్నీలో రమ్యకృష్ణ ఓ నడుడికి చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించారు. అతనెవరో తెలుసుకుందాం..
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి రమ్యకృష్ణ. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సూపర్ ఫాస్ట్‌గా దూసుకెళ్తున్నారు.వైవిధ్యమైన పాత్రలలో మెప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు.
వంత రాజవతాన్ వరువేన్ చిత్రంలో నాజర్‌కు కూతురిగా కనిపించారు. ఈ చిత్రాన్ని తెలుగులో అత్తారింటికి దారేది రీమేక్‌గా తెరకెక్కించారు.అలాగే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించి అద్భుతం సృష్టించిన ‘బాహుబలి’ చిత్రంలో రమ్యకృష్ణ నాజర్ భార్యగా(శివగామి) నటించి ప్రేక్షకుల మదిని మరోసారి దోచేశారు.