పౌరుషాల గడ్డపై పిట్ట బెదిరింపులు పని చేయవ్​: సీఎం కేసీఆర్

-

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఇప్పుడు తెలంగాణపై పడ్డారని.. రాష్ట్రానికి రావాల్సిన ఆర్‌ఈసీ రుణాలు ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఉదయ్‌ పథకంలో చేరాక అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇది పోరాటాలు, పౌరుషాల గడ్డ అని.. ఇక్కడ పిట్ట బెదిరింపులు పనిచేయవని హెచ్చరించారు. విద్యుత్‌ విషయంలో కేంద్రం బండారం బయటపెడతామన్నారు.

దేశాల విద్యుత్‌ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. మరికొన్ని నెలల్లో మీకు అధికారం దూరమవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. రైతుల పాలిట శాపంగా మారిన మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కరాఖండీగా తేల్చిచెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్‌ చట్ట సవరణ బిల్లుపై కేసీఆర్‌ మాట్లాడారు.

’’రూ.4వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30వేలకు వచ్చే బొగ్గు కొనాలా? కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్‌ విధానం వల్ల అంధకారంలోకి వెళ్తున్నాం. అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారు. విద్యుత్‌ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాం. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం’’ అని కేసీఆర్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version