బ్యూటిఫుల్ హీరోయిన్ అదాశర్మ…పూరీ జగన్నాథ్ ‘హార్ట్ ఎటాక్’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామ కాఫీ పౌడర్ యాడ్ చేసింది. దాంతో ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఈ భామ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలోనూ ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ఆకు పచ్చ రంగులో ఉన్న ఉలెన్ బొంత కప్పుకుని అలా కాలు పైకి ఎత్తి అందాలను అలా ఆరబోసి కుర్రకారుకు నిజంగానే ‘హార్ట్ ఎటాక్’ వచ్చేలా చేసింది ఈ భామ.
ఈ ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘హార్ట్ బ్రేక్ మూమెంట్, సో హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఆదా శర్మ విప్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘క్వశ్చన్ మార్క్’ చిత్రంలో నటించింది. ఈ ఫిల్మ్ ఈ నెల 25 న విడుదల కానుంది.