హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ నివేదిక.. 3.4 లక్షల కోట్ల అదాని షేర్లు ఫట్‌

-

హిండెన్‌బర్గ్‌ నివేదికను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చినా.. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు మాత్రం నమ్మదగిందే అంటున్నారు. దీంతో.. హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు అదానీ గ్రూప్ కంపెనీలను వెంటాడుతున్నాయి. ఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన తొమ్మిది లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం 25 శాతం వరకు పతనమయ్యాయి. లోయర్ సర్క్యూట్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేశాయి. అదానీ టోటల్ గ్యాస్ 20 శాతం, అదానీ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌మిషన్‌‌‌‌‌‌‌‌ 19 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 16 శాతం, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ షేర్లు 6 శాతం మేర క్రాష్ అయ్యాయి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్‌ జోన్ , అదానీ విల్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అదానీ పవర్ షేర్లు 5 శాతం చొప్పును పడ్డాయి. బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. అంబుజా సిమెంట్ షేర్లు శుక్రవారం ఇంట్రాడేలో 25 శాతం మేర పతనమయ్యాయి.

2006 తర్వాత కంపెనీ షేర్లు ఇంతలా పడడం ఇదే మొదటిసారి. ఏసీసీ షేర్లు కూడా 20 శాతం వరకు పడగా, అదానీ గ్రూప్ తాజాగా టేకోవర్ చేసిన ఎన్‌‌‌‌‌‌‌‌డీటీవీ షేర్లు 5 శాతం నష్టపోయాయి. కాగా, అదానీ గ్రూప్ అతిపెద్ద కార్పొరేట్ మోసానికి పాల్పడిందని హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ ఆరోపించింది. ఈ గ్రూప్ కంపెనీలకు ఆస్తుల కంటే అప్పులు చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయని, వీటి షేర్లు హై వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్‌‌‌‌‌‌‌‌కు, అకౌంటింగ్ మోసాలకు పాల్పడిందని కూడా ఆరోపించింది. ఈ గ్రూప్‌‌‌‌‌‌‌‌కు చెందిన లిస్టెడ్‌‌‌‌‌‌‌‌ కంపెనీల షేర్లు వాటి ఫండమెంటల్స్‌‌‌‌‌‌‌‌ బట్టి 85 శాతం తగ్గాలని పేర్కొంది. మరోవైపు హిండెన్‌‌‌‌‌‌‌‌బర్గ్‌‌‌‌‌‌‌‌ అదానీ గ్రూప్ షేర్లలో షార్టింగ్ చేసింది కూడా. అంటే షేర్లను ముందుగా అమ్మింది. ఆ తర్వాత ఈ రిపోర్ట్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version